Sammelan
Friday, June 17, 2005
 
కొన్ని వేల మైళ్ల దూరంలో (కార్నెల్ యూనివర్సిటీ, న్యూ యార్క్)

హడావిడిగా ఉంది కాలేజి కేంటీన్, ఇద్దరు మెడికల్ స్టూడెంట్లు మాట్లాడుకుంటున్నారు.

"ఈ పాటికి మన వాడు పూర్తి చేసి ఉంటాడంటావా ? "
"వాడి సంగతి నీకు తెలీదు, FM రేడియో వింటూ ఆపరేషన్ చేస్తాడు,
మనిషి ఎంత సరదాగా ఉంటాడో , పని చేసేటప్పుడు అంత సీరియస్", కాఫీ తాగుతూ అన్నాడు దీపక్.
ఇంతలో చిన్నగా విసిల్ వేస్తూ వచ్చాడు లోకేష్,
"How was it ?"
"Good. Went pretty well."
"అవును, ఆ పేషంట్ కి అనెస్తీషియా అంటే ఎలర్జీ అన్నావు కదా , లోకల్ అనెస్తీషియా ఇచ్చావా ? "
"నా సంగతి నీకు తెలుసు కదా , నో లోకల్ నో స్మగుల్డ్, వోన్లీ ఇంపోర్టెడ్!"
"ఒరే, ఆపరా నీ జోకులు, అహ్ అహ అహ్" చిన్నగా దగ్గుతూ ..
"ఇక్కడ కాఫీ తాగినప్పుడల్లా గొంతు పట్టినట్టు ఉంటుంది" అన్నాడు దీపక్,
"ఈ సారి కాఫీ తాగేటప్పుడు , స్పూన్ అవతల పడెయ్"
"ఒరేయ్ , " ఈ సారి ఇద్దరూ లోకేష్ ని కొట్టడానికి లేచారు!


* * * * * * * * * * * * *

వంట చేస్తున్న లోకేష్ హాల్ లోకి వస్తూ అన్నాడు,
"వంట చెయ్యడం అనేది సైన్స్ కి తక్కువ , ఆర్ట్ కి ఎక్కువ."
హాల్ లో F.R.I.E.N.D.S సీరియల్ ని సీరియస్ గా చూస్తున్న దీపక్ విరక్తిగా అన్నాడు,
"నిజమే, కొంపదీసి ఈ మధ్య పోస్ట్ మోడెర్నిజం, abstract ఆర్ట్ గురించి ఏమీ చదవట్లేదు కదా ?"
"ఛీ, ఐనా ఆర్ట్ నీ కళ్లకెలా కనిపిస్తుంది? పబ్ లో సరైన లైటింగ్ ఉండదు,డిస్కోలో తలకి బేలన్స్ ఉండదు, ఇంతకీ నిన్న నీ డేట్ ఎలా ఉంది ? "
"She is damn good. I think I'm in love with her".
"ఒరే, మొన్న ఇదే మాట వేరే అమ్మాయి గురించి చెప్పావు కదరా ? ఒక్క రోజులో ప్రేమ ఎలా పుట్టుకొస్తుందిరా ?"
"ప్రేమ గుడ్డిది రా "
"ఐతే , వచ్చే వారం , వేరే గుడ్డి అమ్మాయి కనిపిస్తుందా ?"
"ఒరే ...."
తిట్టు మధ్యలోనే ఆగి పోయింది, ఫోన్ రింగ్ అవ్వడంతో!

"చూడరా , నా డేట్ అయ్యివుంటుంది."

లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు.
"You want to speak to Deepak ? He is on vacation. Would you like to hold the line ?"
"ఒరే ..."
పరిగెడుతూ వెళ్లి ఫోన్ లాక్కున్నాడు దీపక్.

కాసేపు గోడకి ఆనుకుని
కాసేపు బీన్ బేగ్ మీద కూర్చోని
కాసేపు వాటర్ బెడ్ మీదకి ఫోన్ లాక్కొని
కాసేపు నడుస్తూ ,
కాసేపు నవ్వుతూ
కాసేపు గుండ్రంగా తిరుగుతూ మాట్లాడుతున్నాడు దీపక్.

టిక్ టిక్ పావు గంట
టిక్ టిక్ అర గంట
టిక్ టిక్ గంట
టిక్ టిక్ గంటన్నర

సాగుతూనే ఉంది సంభాషణ.

ఇక లాభం లేదని వెళ్లి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు లోకేష్.
"ఏం చేస్తున్నావ్ "
"చాల్లేరా, కాలేజి నించి ఇంటికి వచ్చిన అర గంట గురించి రెండు గంటలు చెప్తున్నావ్ "
ట్రింగ్ ట్రింగ్ , ఫోన్ మళ్లీ మోగడంతో స్టెల్లా అయి ఉంటుంది అనుకుంటూ లిఫ్ట్ చేశాడు దీపక్.
"స్టెల్లా , What happened was ... "
"ఎవరు స్టెల్లా ? మా అబ్బాయి కి ఫోన్ ఇవ్వు", గాటుగా వినిపించింది కంఠం.
"లోకెష్, నీకు ఫోన్, ఊలపల్లి నించి!"
పరిగెడుతూ వచ్చి ఫోన్ తీసుకుని అన్నాడు "నాన్న గారు..."
"ఏరా మాలోకం, ఈ స్టెల్లా ఎవరు ? "
"నాన్నా , ఎన్ని సార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని, నా పేరు లోకేష్"
"పాలు కాచి తోడు పెట్టరా అంటే ఇల్లంతా పొగ పెట్టిన మాలోకానివి"
"అది అప్పుడు నాన్నా , ఇప్పుడు నేను పెద్ద ని chef ని,రెస్టారెంట్ పెడదామని చూస్తున్నా"
"నీ తిండి తిన్న వాళ్లందరికీ నువ్వు వైద్యం చెయ్యగలిగితే చాలు, సరిపడే డబ్బులు , ఏం తెలివి రా ?"
"ఎంతైనా డాక్టర్ కృష్ణమూర్తి గారి కొడుకును కదా ?"
"సరి , సరి , నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి "
"దేని గురించి నాన్నా ?"
"నీలు గురించి"

సశేషం [బెంగుళూరు, (జూలై 11, 2005) , కళ్యాణ్(కాకినాడ)]

Comments:
Hi,
nenu meeku thelisina vijay ni kaadhu. ee kadhani nenu modhati nunchi follow avuthune unnanu kaani eppudu comment cheyyaledhu. kaani ivaalati twist choosina tharuvaatha comment cheyyakunda undalekapothunnanu!!! emi twistlandi baabu. mee imaginationki hats off!!!! storyni khandalu(continents) dhaatinchesthunnaru. tharuvaatha emavuthundhonanna anxiety nenu aapukolekapothunnanu. marinni twistlatho ee story ilaage mundhuku saagalani korukuntunnanu.
 
Awesome man...really awesome. adirindi twist.
 
Hello Vijay, CTS Chennai ninchi regular ga follow avutunnadi nuvvena ? Welcome here.
How did you arrive here ?
 
Hi,
how do you know that I'm working in CTS???
Nenu aditya frndni. so ala ee blog gurinchi naaku thelisindhi. appat nunchi regularga follow avuthunnanu.
 
డాక్టరు గారిది పోలవరము రా కళ్యాణ్ ....
 
Should have chosen better names. ప్రాసపాటించే పల్లెలు was the last thing we needed. ఇంకోటి, ఊలపల్లి అనే గ్రామం నిజంగానే ఉందా? Do they use solar power? :-)
 
ఊలపల్లి నిజంగానే వుంది. కళ్యాణ్ వాళ్ళ తాతయ్య గారి ఊరు. ఈ సోలార్ పవర్ జోకు అర్దము కాలేదు!!!
ఏమిటి చెప్మా :-0

" అది రాజస్తాను లొని పింప్రి గ్రామం. సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ వారు ఇక్కడ బయొ గాసుతొ విద్యుత్తు చేసే పరికరాన్ని తొలి సారిగా ప్రయోగిస్తున్నారు..." - ఊలపల్లి is pimpri of AP...
 
yeah, అదే. కానీ, అది solar power అన్నట్లు గుర్తు. ఆ దంపతులు నీళ్లని కూడా solar power తోనే వేడి చేసుకునేవారనుకుంటా. Somebody should work సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ into the story.
 
ikkada gvk ante vijay from CA na? emee ledu..na vere friend initials kooda gvk ne.. so kaasta confuse ayya.

vj, eenatininchi nuvvu vijay(chennai) ga perondedavugaaka!
 
Post a Comment

<< Home

Powered by Blogger