Sammelan
Wednesday, November 08, 2006
 
Identify the telugu song - A fun viral game
మొన్న వంశీ "ఎడమ చేతను శివుని విల్లు విరిచిన ఆ రాముడే , ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో" అని మొదలు పెట్టాడు ఆటని. వెంటనే రాంబాబు (డోలా) "రామచక్కని సీతకు - గోదావరి" అని రిప్లై కొట్టాడు. అప్పుడే అర్థమైంది ఇదేదో చాలా పెద్ద వ్యవహారం అవుతుందని. నేను "తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం" అని అడిగి నిద్రపోయాను . స్టాలిన్ లో పాట అని వంశీ గెస్ కొట్టాడు. చిరంజీవి పాటే కానీ ఆ మూవీ కాదు! మధు ఈలోపల "పువ్వుల చొక్కా తొడిగావంటే ఎవరీ మన్మథుడని అంటారయ్యా నిన్ను" అని అడిగాడు. అందాలరాముడు అని రాంబాబు చెప్పాడు. కొద్దిసేపటికి వంశీ Google లో వెతికి నేనడిగిన పాట "లలితప్రియకమలం - రుద్రవీణ" అని కనిపెట్టాడు. ఇంక Google ని ఈ ఆటలో ఇల్లీగల్ చేయాలని అనుకున్నా, తర్వాత్తర్వాత జనాల స్పీడ్ చూస్తే ఆ అవసరం లేదని తెలిసిపోయింది. వంశీ ఆన్సర్ చూసి "యదార్థం చేదుగుంటది, పదార్థం చెత్తగున్నది" అని అడిగాను. వెంటనే సందీప్ "ఒంపుల వైఖరి - ఏప్రిల్ 1 విడుదల" అని రిప్లై కొట్టాడు. సినిమా కరెక్టే కానీ పాట - "మాటంటే మాటేనంట". ఇది పక్కరోజు మధ్యాహ్నం వరకూ జరిగిన కథ.

అసలు గోల నిన్న రాత్రి మొదలైంది. జనాలు సెకండ్స్ లో పాటలేంటో చెప్పెయ్యటం. హైదరాబాద్, బెంగుళూరు, మినియాపోలిస్, సనీవేల్ - జాగ్రఫీ తో సంబంధం లేదు. ఇక ఉత్సాహం ఆపుకోలేక మా గొలుసుకథ ఒరిజినల్ ఆడియన్స్ ఆదిత్య కూడా ఆటలో కలిశాడు. నేను "తహతహ తరగదు అలజడి అణగదు తనసొద ఇది అని తలపును తెలుపదు" అని అడిగాను. "ఈ మనసే - తొలిప్రేమ" అని సందీప్ చెప్పేసి "నిద్దరనే సెలవడిగి, ఇద్దరినీ కలవమని" అని అడిగాడు. "బంతి, చామంతి" అని మధు చెప్పాడు. ఈ లోపల ఆదిత్య అడిగిన "అందంగా ఉంది, తన వెంటే పది మంది" కి కూడా "బొమ్మని గీస్తే - బొమ్మరిల్లు" అని మధు చెప్పి "చేరువైన రాయబారాలే చెప్పబోతే మాటమౌనం" అని అడిగాడు. "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు" అని ఆదిత్య, నేను చెప్పాము.

తర్వాత "పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా" అని అడిగాను. కొద్ది సెకండ్స్ లోనే "కరిగిపోయాను కర్పూర వీణలా" అని సందీప్, ఆదిత్య రిప్లైలు కొట్టేశారు. Google వాడకుండా ఇది ఎలా సాధ్యం అని వంశీ ఆశ్చర్యం! ఇంతలో "వుడికించే చిలకమ్మా నిన్నూరించే, వొలికించే అందాలే ఆలాపించే" అని ఆదిత్య అడిగాడు. "ఒక బృందావనం - ఘర్షణ" అని రాంబాబు చెప్పాడు. సినిమా కరెక్టే కానీ పాట - "నిన్ను కోరి" అని సందీప్, మధు, నేను చెప్పాము. "శృంగారవీధుల్లో చిందేసుకో, మందార బుగ్గల్ని చిదిమేసుకో" అని మధు ట్రేడ్ మార్క్ పాట అడిగాడు. "కాశ్మీరు లోయలో - పసివాడి ప్రాణం" అని సందీప్ చెప్పేశాడు. నేను "నా కోసమే చినుకై కరిగి, ఆకాశమే దిగదా ఇలకు" అని అడిగాను. "అలుపన్నది ఉందా - గాయం" అని ఆదిత్య చెప్పాడు.

మొట్టమొదటి ఆన్సర్ లేని పాట మధు ఇప్పుడు అడిగాడు "నువ్వక్కడ నేనిక్కడ నింగక్కడ నేలిక్కడ" అని. చిరంజీవి పాట అని మిస్లీడ్ చేసి ఎవరూ చెప్పలేకపోయేసరికి "చిరు చెయ్యేస్తే - స్టైల్" అని తప్పించుకున్నాడు. నేను "నువ్వే నా లక్కు, నీ మీదే హక్కు" అని అడిగాను. శివ సినిమా అని మధు గెస్ కొట్టాడు (పాట ఆనందో బ్రహ్మ). తర్వాత "పాలల్లో మీగళ్లు, పరువాల ఎంగిళ్లు" అని అడిగాడు. "చక్కిలిగింతల రాగం - కొదమసింహం" అని ఆదిత్య, నేను చెప్పాము.

ఈ సారి ఒక పదం మాత్రమే ఇచ్చాను "రుద్రమకు". అయినా సందీప్, ఆదిత్య చెప్పేశారు "ఊర్వశీ - ప్రేమికుడు" అని. మళ్లీ "మైథలాజికల్" అని అడిగాను. "లేచిందే లేడికి పరుగు - మనీ" అని ఆదిత్య చెప్పాడు. "కాలి మువ్వగ నిలిచెను కాలము" అని అడిగాడు. నేను అప్పటికే అడిగేసిన పాట అది, "లలితప్రియకమలం - రుద్రవీణ" అని చెప్పి "చిట్టా" అని అడిగాను. ఎవరూ చెప్పకపోవటంతో "అమ్మమ్మలు తాతయ్యలు - నువ్వే కావాలి" అని చెప్పి "అనుకోని రాగమే అనురాగ దీపమై" అని అడిగాను. "పూసింది పూసింది పున్నాగ - సీతారామయ్యగారి మనవరాలు" అని రాంబాబు చెప్పి "ఓడిపోవాలి స్వార్థం, ఇల మరచిపోవాలి యుద్ధం" అని అడిగాడు. "కొత్త బంగారులోకం - దొంగ దొంగ" అని మధు, నేను చెప్పాము.

ఆదిత్య "కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో" అని అడిగాడు. "గిలిగా గిలిగిలిగా - రాక్షసుడు" అనుకున్నాను కానీ, ఆదిత్య కాదు అనేసరికి "ఇందువదన - ఛాలెంజ్" అని మధు, రాంబాబు, నేను చెప్పాము. మధు "నీ కత్తి దూసెయ్యి దూసెయ్యి" అని అడిగాడు. "ప్రేమిస్తే ప్రాణమిస్తా - మెకానిక్ అల్లుడు" అని ఆదిత్య చెప్పాడు. నేను "వేణువా వీణియా" అని అడిగి తర్వాత "ఏమిటీ గానము" వస్తుంది అని హింట్ ఇచ్చాను. "సుమం ప్రతిసుమం" అని ఆదిత్య చెప్పాడు.

తర్వాత పాటలు కాకుండా మాటల మీదకి ఆట మళ్లింది. దాని కథ ఇంకొక రోజు!

Comments: Post a Comment

<< Home

Powered by Blogger